ఆర్ ఎక్స్ 100 సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తోలి సినిమాతోనే సంచలన విజయం అందుకున్నాడు హీరో కార్తికేయ. ఈ సినిమా తరువాత అయన తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్న చిత్రం హిప్పీ. టి ఎం కృష్ణ దర్శకత్వంలో తమిళ క్రేజీ నిర్మాత కలైపులి ఎస్ దాను నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ఫిలిం సిటీలో జోరుగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సందర్బంగా గురువారం చిత్ర యూనిట్ మీడియా తో సమావేశమయ్యారు ..
ఈ కార్యక్రమంలో హీరో కార్తికేయ మాట్లాడుతూ .. ఆర్ ఎక్స్ 100 సక్సెస్ తరువాత మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను. హిప్పీ కథ నాకు బాగా నచ్చింది. చాలా కొత్తగా ఉంటుంది. కొత్తగా అనగానే ఏదేదో ఆర్ట్ సినిమా అనుకోవద్దు, అందరికి నచ్చే అన్ని అంశాలతో చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమాకు కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. నిజంగా అయనకు చాలా క్లారిటీ ఉంది. ఎవరినుండి ఏది ఎలా రాబట్టుకోవాలి ఆనంది బాగా తెలుసు . ఇక మరో ముఖ్య పాత్రలో జెడి నటించడం తో చాలా ఎగ్సాయిజ్ అవుతున్నాను. తమిళంలో టాప్ నిర్మాతగా పేరు తెచ్చుకున్న కలైపులి దాను గారు ఈ సినిమాని నిర్మించడం ఆనందంగా ఉంది. తప్పకుండ ఆర్ ఎక్స్ 100 ని మించే సినిమా అవుతుంది అన్నారు.
జెడి చక్రవర్తి మాట్లాడుతూ .. ఈ సినిమాలో ని పాత్ర గురించి వినగానే నాకు బాగా నచ్చి వెంటనే ఒకే చెప్పాను. కథ కూడా అద్భుతం. నిజంగా కార్తికేయ లక్కీ పర్సన్ లేకుంటే సౌత్ లోనే టాప్ ప్రొడ్యూసర్ తో రెండో సినిమా చేయడం మాములు విషయం కాదు అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ .. ఇది కొత్త కథ కానేకాదు . మనకథ , లేక మన పక్కింటో జరిగే కథలా ఉంటుంది. కార్తికేయ అద్భుతంగా చేస్తున్నాడు అలాగే హీరోయిన్ కూడా బాగా చేస్తుంది. ముక్యంగా థాను లాంటి నిర్మాత నన్ను నమ్మి సినిమా ఇవ్వడం ఆనందంగా ఉంది. ఆయనకు ఎప్పుడు రుణపడి ఉంటాను. సినిమా దాదాపు సగం పైగా పూర్తయింది. వీలైనంత త్వరగా మీ ముందుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.
నిర్మాత కలైపులి థాను మాట్లాడుతూ .. ఆర్ ఎక్స్ 100 సినిమా చూసాను నాకు బాగా నచ్చింది. అప్పుడే అనుకున్నా ఈ హీరోలో ఎదో మ్యాజిక్ ఉంది ఇతనితో సినిమా చేయాలనీ . అప్పుడే దర్శకుడు ఈ కథ చెప్పాడు , సరిగ్గా అతనికి సరిపోయితే కథ .. అందుకే వెంటనే షూటింగ్ మొదలు పెట్టాము, కార్తికేయ కు ఇది బెస్ట్ సినిమా అవుతుంది అన్నారు.